నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఆవరణలోని ఓపెన్ యార్డులో ఉన్న విద్యుత్ నియంత్రికను మరమ్మత్తులు చేసి మళ్ళీ కూలింగ్ ఉంచే క్రమంలో... విద్యుత్ నియంత్రికలో మంటలు ఎగసిపడ్డాయి. సిబ్బంది అప్రమత్తంగా ఉండడం వల్ల చెలరేగిన మంటలను వెంటనే అర్పివేశారు.
నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రంలో మంటలు
నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది వెంటనే మంటలు ఆర్పివేయగా.. ఎలాంటి నష్టం వాటిల్లలేదని జెన్కో డైరెక్టర్ తెలిపారు.
నాగార్జునసాగర్ విద్యుత్ కేంద్రంలో మంటలు
ఘటనా స్థలాన్ని జెన్కో డైరెక్టర్ వెంకట రత్నం పరిశీలించారు. వైరింగ్ గట్టి పడ్డడం కోసం ట్రాన్స్ఫార్మర్ పైన కప్పిన టార్పాలిన్కు విద్యుత్ బల్బుల వల్ల అనుకోకుండా మంటలు అంటుకున్నాయని డైరెక్టర్ తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు.