పెట్రోల్ బంకులో అగ్నిమాపక అధికారుల తనిఖీ - fire_awarness_at_petrol_bunk
పెట్రోలో బంక్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగితే ఏ విధంగా అదుపులోకి తీసుకురావాలో బంకు సిబ్బందికి అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడాలోని బైపాస్ వద్ద ఉన్న పెట్రోల్‌బంక్‌లో అగ్నిమాపక సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంటలను ఆర్పేందుకు వినియోగించే సిలిండర్లు, ఇసుక ప్యాకెట్లను తనిఖీ చేశారు. అనంతరం ఆకస్మికంగా మంటలు చెలరేగితే ఏవిధంగా ఆపాలో పెట్రోల్ బంకు సిబ్బందికి వివరించారు. ప్రతీ శుక్రవారం జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మంటలు చెలరేగితే వాటిని అదుపులోకి ఎలా తీసుకురావాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పెట్రోల్, డీజిల్, కిరోసన్ వల్ల మంటలు చెలరేగినప్పుడు నీరుపోసి అదుపులోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తారని... కానీ మంటలు ఇసుక, సిలిండర్ ద్వారా త్వరగా అదుపులోకి వస్తాయని తెలిపారు.