తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటును నిరసిస్తూ రైతుల ధర్నా

పేదల భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటును నిరసిస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్​ ముందు అఖిలపక్షం పార్టీ నేతలు, రైతులు ఆందోళనకు దిగారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు వల్ల వాతావరణం కాలుష్యమై చుట్టూ గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : Sep 22, 2020, 4:18 PM IST

farmers-protest-in-nalgonda-district-
నల్గొండ జిల్లాలో రైతుల ఆందోళన

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో పేదల భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయొద్దని అఖిలపక్ష నేతలు, రైతులు ఆందోళనకు దిగారు. పార్కు ఏర్పాటు వల్ల వాతావరణం కాలుష్యమవుతుందని, చుట్టూ గ్రామాల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

280 ఎకరాల్లోని అసైన్డ్ భూముల్లో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్కు వల్ల భూగర్భ జలాలు కాలుష్యమవుతాయని వాపోయారు. రైతులు సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నుంచి భూములు లాక్కుంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details