రాష్ట్రంలో సన్నరకం వరిధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ధాన్యం విక్రయించడానికి టోకెన్ల కోసం తెల్లవారుజామునుంచే రైతులు బారులు తీరారు.
అన్నదాత అరిగోస... ధాన్యం టోకెన్లకి అవస్థ
సన్నరకం వరిధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం టోకెన్ల కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలతో సాగుచేసినా... మద్దతు ధర కల్పించడం లేదని వాపోయారు.
ధాన్యం టోకెన్ల కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు
సగం మంది రైతులు టోకెన్లు లేకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని... సరిపడా టోకెన్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సన్నధాన్యానికి 2,500 గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సాగుచేస్తే ఇప్పుడు మద్దతు ధర కల్పించడం లేదని వాపోయారు.