నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మిల్లర్లు ధాన్యం కొనుగోలు నిలిపివేశారు. అవంతిపురంలో గల బాలాజీ రైస్ మిల్ తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండటం వల్ల టాస్క్ఫోర్స్ అధికారులు సోమవారం నాడు సీజ్ చేశారు. దానికి నిరసనగా ఈ రోజు మిల్లర్లు ధాన్యం కొనుగోలు నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మిర్యాలగూడలో రైతుల రాస్తోరోకో.. మిల్లర్ల నిరసన
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ వైపు రైతులు రాస్తారోకో చేస్తుంటే... మరో వైపు మిల్లర్లు నిరసన చేపట్టారు. ధాన్యం కొనుగోళ్ల ఆపడం వల్ల రైసు మిల్లుల ముందు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
మిర్యాలగూడలో రైతుల రాస్తోరోకో.. మిల్లర్ల నిరసన
మిల్లర్లు ధాన్యం కొనుగోలు నిలిపివేయడం వల్ల మిల్లుల వద్ద భారీ సంఖ్యలో టాక్టర్లు నిలిచి ఉన్నాయి. రెండు రోజులగా వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల ధాన్యం పాడయ్యే ప్రమాదం ఉందని, మద్దతు ధర రాదేమోనని ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి:సన్నరకానికి మద్దతు ధర చెల్లించని మిల్లర్లపై టాస్క్ఫోర్స్ కొరడా
Last Updated : Nov 3, 2020, 11:25 AM IST