ప్రాణం తీసిన భూవివాదాలు.. పొలంలో ఉరివేసుకున్న వికలాంగుడు - పొలంలో చెట్టుకు ఉరేసుకుని వికలాంగుడి ఆత్మహత్య
భూవివాదాల కారణంగా ఓ వికలాంగుడు తన పొలంలోని చెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఇందుర్తిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
farmer suicide in indhurthi village
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ఇందుర్తిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకన్న అనే వికలాంగుడు తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకన్న ప్రస్తుతం శివన్నగూడ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. భూ వివాదాల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని వెంకన్న భార్య ఆరోపిస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.