నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ అభిమానులు, కార్యకర్తలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు - కరోనా నుంచి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కోలుకోవాలంటూ పూజలు
నల్గొండ శాసనసభ్యులు భూపాల్‌రెడ్డి కరోనాబారిన పడిన విషయం విదితమే. అయితే తమ అభిమాన నేత భూపాల్‌రెడ్డి మహమ్మారి బారినుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ పోనుగొడు గ్రామంలోని జక్కన్నగుట్ట ఆలయంలో కార్యకర్తలు, తెరాస నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తర్వగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు
అలాగే జిల్లాలోని కనగల్ మండలం పోనుగొడు గ్రామంలో గల జక్కన్నగుట్టపై కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్థానిక ఎంపీటీసీ, మండల తెరాస నాయకులు కార్యకర్తలు తమ అభిమాన నేత త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
ఇదీ చూడండి:కరోనాను నశింపజేసే నమూనా తయారు చేసిన బీటెక్ విద్యార్థి