తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఊరికో మట్టి వినాయక విగ్రహాన్ని నిలపుకుంటే బాగుంటుంది'

ప్రకృతి హిత వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ ఊరికో విగ్రహాన్ని నిలుపుకోవాలని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్​ రెడ్డి సూచించారు. నల్గొండ జిల్లాలోని వైఆర్పీ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీలో ఆయన పాల్గొన్నారు.

'ఊరికో మట్టి వినాయక విగ్రహాన్ని నిలపుకుంటే బాగుంటుంది'

By

Published : Sep 1, 2019, 8:50 PM IST

నల్గొండ జిల్లాలోని స్థానిక క్లాక్​ టవర్​ వద్ద ప్రకృతి హిత వినాయకుడిని పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో... యాలిశాల రవి ప్రసాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యమనికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జిల్లా ఎస్పీ హాజరై విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవటాని అందరం కృషి చేయాలని, గ్రామానికి ఒక్కొక్క విగ్రహాన్ని నిలుపుకుంటే బాగుంటదని గుత్తా సుఖేందర్ రెడ్డి​ సూచించారు.

'ఊరికో మట్టి వినాయక విగ్రహాన్ని నిలపుకుంటే బాగుంటుంది'

ABOUT THE AUTHOR

...view details