నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమావాస్య కావటం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారు. ఈరోజు ఇక్కడ నిద్ర చేస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి తరలొస్తున్నారు.ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
చెరువుగట్టులో అమావాస్య పూజలు..పోటెత్తిన భక్తులు - cheruvu gattu
అమావాస్య వచ్చిందంటే చాలు ఆ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. రామలింగేశ్వరుడిని దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి తరలొస్తారు. అదే..నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు దేవస్థానం.
చెరువుగట్టులో అమావాస్య పూజలు