తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చేరిన కొవిడ్ టీకాలు - Telangana Vaccination latest news

కొవిడ్ టీకాలు జిల్లాలకు చేరాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వైద్యాధికారుల సమక్షంలో... వ్యాక్సిన్లు భద్రపరిచారు. నల్గొండ, సూర్యాపేటకు సంబంధించి నల్గొండకు... యాదాద్రి జిల్లాకు సంబంధించి భువనగిరికి టీకాలు చేరాయి.

covid vaccines reaching the joint Nalgonda district
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చేరిన కొవిడ్ టీకాలు

By

Published : Jan 15, 2021, 12:38 PM IST

తొలి దశలో ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు ఇవ్వనున్న కొవిడ్ టీకాలు... జిల్లా కేంద్రాలకు చేరాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు సంబంధించిన డోసుల్ని నల్గొండకు... యాదాద్రి జిల్లాకు సంబంధించి భునవగిరి డీఎంహెచ్​ఓ కార్యాలయాలకు తరలించారు.

ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వెయ్యి 29 మందికి, పానగల్ యూపీహెచ్​సీలో 120, మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో 126 మంది వైద్య సిబ్బందికి టీకా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నెల 16న మాత్రం జిల్లా ఆసుపత్రిలో 60, పానగల్, మిర్యాలగూడ దవాఖానాల్లో 30 మంది చొప్పున మొత్తం... 120 మందికి టీకా వేయనున్నారు.

యాదాద్రి జిల్లాలో మూడు చోట్ల టీకాలు ఇవ్వనున్నారు. భువనగిరి పట్టణ ఆరోగ్య కేంద్రం, కొండమడుగు, చౌటుప్పల్ ఆసుపత్రుల్లో టీకాలు వేయనున్నారు.

ఇదీ చదవండి: 'వ్యాక్సినేషన్​ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం'

ABOUT THE AUTHOR

...view details