నల్గొండ జిల్లా మునుగోడు కార్తికేయ కాటన్ ఇండస్ట్రీస్‌లో రైతులు ఆందోళన చేశారు. నిబంధనలు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 3 రోజులుగా పడిగాపులు పడుతుంటే... చివరికి తేమ, కాయ ఉందంటూ తిరిగి పంపించటం దారుణమని సీసీఐ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మునుగోడులో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద పత్తి లోడుతో వచ్చిన వాహనాలు రహదారి వెంట కిలోమీటర్ల మేర వేచి ఉన్నాయి. తమ సంఖ్య వచ్చేందుకు 3-4 రోజులుగా చలిలో ఎదురు చూస్తే చివరికి సిబ్బంది ఇలా వెనెక్కి పంపించటం సరికాదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడు సీసీఐ కేంద్రంలో పత్తిరైతుల ఆందోళన
నల్గొండ జిల్లా మునుగోడులో పత్తిరైతులు ఆందోళనకు దిగారు. మూడు నాలుగు రోజులుగా వేచి చూస్తుంటే... తేమ, కాయ పేరుతో వెనక్కి పంపిస్తున్నారంటూ రైతులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
COTTON FARMERS PROTEST AT MUNUGODU CCI CENTER
TAGGED:
COTTON FARMERS PROTEST