కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ.. జలాశయాల వద్ద ఇవాళ దీక్షలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఎస్సెల్బీసీతోపాటు నల్గొండ జిల్లాలోని నక్కలగండి ప్రాజెక్టుల వద్ద నిరసన చేపట్టేందుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి నల్గొండ జిల్లాలోకి ప్రవేశించారు.
జలదీక్షకు వెళ్తుండగా... ముగ్గురు నేతలు అరెస్ట్
రాష్ట్రంలోని జలాశయాల వద్ద నిరసన దీక్షలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే నల్గొండ జిల్లా నక్కలగండి ప్రాజెక్టుల వద్ద దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీనియర్ నేత జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చింతపల్లి మండలం గొడుకొండ్ల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జలదీక్షకు వెళ్తుండగా... ముగ్గురు నేతలు అరెస్ట్
హైదరాబాద్ నుంచి దేవరకొండ మీదుగా వెళ్లేందుకు యత్నించడం వల్ల... చింతపల్లి మండలం గొడుకొండ్ల చెక్‌పోస్టు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముందుగా వచ్చిన కోమటిరెడ్డిని అదుపులోకి తీసుకోగా... ఆయన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాగా అనంతరం ఉత్తమ్, జానా సైతం అక్కడకు చేరుకోవడం వల్ల... ముగ్గురు నేతలతోపాటు వారి అనుచరులు, పార్టీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:స్వరాష్ట్రంలో సిక్సర్ కొట్టిన కేసీఆర్