నాగార్జున సాగర్ ఉపఎన్నిక పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. హస్తం పార్టీ అభ్యర్థి జానారెడ్డి తరఫున ఆ పార్టీ నేత పొన్నం ప్రభాకర్, జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఊటుకూరు, బండివారి గూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటు అభ్యర్థించారు.
సాగర్లో కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం - నల్గొండ జిల్లా వార్తలు
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి తరఫున ఆ పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. నిడమనూరు మండలం ఊటుకూరు, బంటివారి గూడెంలో పొన్నం ప్రభాకర్, జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి... ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఇచ్చిన హామీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తెరాస నేతలు వాటి అమలు విషయం మరచిపోయారని ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, వృద్ధులకు పింఛన్ వంటి హామీలు ఇప్పటికీ నెరవేర్చలేకపోయారని విమర్శించారు. అధికారంలోకి ఇన్నేళ్లయినా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగలను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాలు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారని... అవి అమలు కావాలంటే అనుభవంతో పాటు ప్రశ్నించే తత్వం ఉన్న వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హస్తం గుర్తుపై ఓటు వేసి జానారెడ్డిని గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి:సునీల్ చావును రాజకీయం చేయం.. కానీ! : ఆర్. కృష్ణయ్య