నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గోగువారి గూడెం గ్రామంలో పొలం గట్ల విషయంలో జరిగిన ఘర్షణలో జంగా సైదులు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గోగువారి గూడెంకు చెందిన జంగా సైదులు అనే రైతు తన పొలానికి వచ్చే పంట కాలువను, పక్క పొలానికి చెందిన వారు చెడగొట్టడం వల్ల మిర్యాలగూడ రూరల్ పీఎస్లో వారిపై ఫిర్యాదు చేశాడు.
పొలం గట్ల విషయంలో ఘర్షణ... ఓ వ్యక్తికి గాయాలు - నల్గొండ జిల్లా వార్తలు
పొలం గట్ల విషయంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన నల్గొండ జిల్లా గోగువారిగూడెం గ్రామంలో జరిగింది. అతనిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పొలం గట్ల విషయంలో ఘర్షణ... ఓ వ్యక్తికి గాయాలు
తమపై పోలీస్ స్టేషన్లో కేసు పడతావా అంటూ పెద్దగుల శ్రీను, వెంకన్న, కృష్ణయ్య, విష్ణులు కలిసి కొడవళ్లతో, రాళ్లతో దాడి చేశారని బాధితుడు వాపోయాడు. ముఖంపైన, తలపైన స్వల్ప గాయాలయ్యాయి.
ఇవీ చూడండి: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్