తెలంగాణ

telangana

ETV Bharat / state

కలుషిత ఆహారం పెట్టిన సిబ్బందిపై వేటు - workers

కస్తూర్భాగాంధీ పాఠశాలలో విద్యార్థినుల అస్వస్థకు కారకులైన సిబ్బందిపై నల్గొండ జిల్లా పాలనాధికారి వేటు వేశారు. కలుషితమైన అల్పాహారం పెట్టినట్టు విచారణలో తేలింది. నలుగురు సిబ్బందిని తొలగించారు.

కలుషిత ఆహారం పెట్టిన సిబ్బందిపై వేటు

By

Published : Jun 29, 2019, 12:45 PM IST

నల్గొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ పాఠశాల విద్యార్థినుల అస్వస్థతకు కారకులైన నలుగురు సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. ఈనెల 26న అల్పాహారం తిన్న 160మందిలో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అల్పాహారంలో విద్యార్థినులకు కుల్లిన కూరగాయలు, పురుగులు పట్టిన అన్నం పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ గౌరవ్​ ఉప్పల్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. నలుగురిపై వేటు వేశారు.

కలుషిత ఆహారం పెట్టిన సిబ్బందిపై వేటు
ఇదీ చూడండి: జడ్పీటీసీ పవిత్రపై క్రిమినల్​ కేసు

ABOUT THE AUTHOR

...view details