నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని చర్లగూడెంలో నిర్మిస్తున్న జలాశయంలో భూములు, ఆవాసాలు కోల్పోతున్న ప్రజలు ఆందోళకు దిగారు. మల్లన్నసాగర్లో మాదిరిగా ఎకరాకు 11 లక్షల నష్ట పరిహారం చెల్లించాలంటూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రతీ కుటుంబానికి బతుకు దెరువు కోసం ఇచ్చే జీవన భృతి ఏడున్నర లక్షలు, ఒక ఇల్లు ఇవ్వాలని కోరారు. నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చేవరకు ఆందోళన ఆపబోమని హెచ్చరించారు.
చర్లగూడెం భూ నిర్వాసితుల ధర్నా
మల్లన్నసాగర్ ప్రాజెక్టు తరహాలో ఇచ్చినట్లుగా తమకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ... చర్లగూడెం భూనిర్వాసితులు ఆందోళన చేశారు.
చర్లగూడెం భూ నిర్వాసితుల ధర్నా