కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను కావాలనే కొందరు వివాదాస్పదం చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బనియల్ అన్నారు. నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియాలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
'రైతులకు అన్యాయం చేసే పనులు ఎప్పుడూ చేయం' - తెలంగాణ వార్తలు
నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియాలో నూతన వ్యవసాయ చట్టాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బనియల్ పాల్గొన్నారు.
'రైతులకు అన్యాయం చేసే పనులు ఎప్పుడూ చేయం'
రైతులు పండించిన పంటలు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉందని మంత్రి అన్నారు. రైతులకు అన్యాయం జరిగే పనులు భాజపా ఎప్పుడూ చేయదన్నారు. ఈ సదస్సుకు జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, నాగార్జున సాగర్ భాజపా ఇంఛార్జి నివేదిత రెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.