తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ రెండు పార్టీలు సాగర్​ను పాలించినా అభివృద్ధి శూన్యం' - నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం

సీనియర్‌ నేతగా చెప్పుకునే జానారెడ్డి.. నాగార్జునసాగర్ ప్రాంత అభివృద్ధిని అడుగడుగునా విస్మరించారని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. సాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా.. భాజపా అభ్యర్థి రవికుమార్‌తో కలిసి ఆయన త్రిపురారం మండలంలో ప్రచారం చేశారు. గ్రామాల్లో తిరుగుతూ కమలం పువ్వుకు ఓటువేయాలని ఓటర్లను అభ్యర్థించారు. మునిగిపోతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేసినా వ్యర్థమే అని కిషన్‌రెడ్డి విమర్శించారు. అవినీతి తెరాసకు సాగర్‌ ప్రజలు బుద్ధిచెప్పాలని ఆయన కోరారు.

central minister kishan reddy campaign in tripuraram mandal
కిషన్‌రెడ్డి

By

Published : Apr 10, 2021, 1:26 PM IST

Updated : Apr 10, 2021, 3:28 PM IST

రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారాన్ని చేజిక్కించుకున్న తెరాస, కాంగ్రెస్​లు నాగార్జునసాగర్​ను పూర్తిగా విస్మరించాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పదవులు చేపట్టిన జానారెడ్డి.. సాగర్​ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్​ ఓడినా గెలిచినా పెద్దగా ఒరిగేదేమి లేదని ఎద్దేవా చేశారు. నాగార్జున సాగర్​ ఉపఎన్నిక సందర్భంగా భాజపా అభ్యర్థి రవికుమార్​ నాయక్​ తరఫున నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో కిషన్​ రెడ్డి ప్రచారం చేశారు.

'కాంగ్రెస్​కు భవిష్యత్తు లేదు.. అది నిన్నటి పార్టీ. తెరాస ఒక కుటుంబ పార్టీ. స్వప్రయోజనాలు తప్ప.. ప్రజల గురించి ఆలోచించదు. తెలంగాణ కోసం 1200 మంది బలిదానం చేశారు. కానీ రాష్ట్రాన్ని శాసించేది కేవలం కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాలు మాత్రమే. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లేవు. దళితులకు ఇస్తామన్న మూడెకరాలు, డబుల్​బెడ్​ రూమ్​ ఇళ్లు ఎటుపోయాయి.? ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ. 2వేల కోట్ల ఖర్చుతో ఎయిమ్స్ హాస్పిటల్​, మెడికల్​ కళాశాలను కేంద్ర ప్రభుత్వం కట్టించింది.'

కిషన్​ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

'రెండు పార్టీలు సాగర్​ను పాలించినా.. అభివృద్ధి శూన్యం'

ఈ రాష్ట్రాన్ని కాంట్రాక్టర్ల పేరుతో దోచుకుంటున్నారని... రాబోయే శాసనసభ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్​కు డిగ్రీ కళాశాల రావాలన్నా.. హాలియాలో ఆర్డీఓ కేంద్రం ఏర్పాటు చేయాలన్నా కమలం గుర్తుకు ఓటేసి భాజపా అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి:రేవంత్​కు తెరాస గురించి మాట్లాడే అర్హత లేదు: బాల్క సుమన్

Last Updated : Apr 10, 2021, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details