తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వస్థలానికి చేరుకున్న జవాన్‌ వెంకన్న మృతదేహం - telangana varthalu

పటాన్​కోట్​లో మరణించిన ఆర్మీ జవాను వెంకన్న మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ నివాళులర్పించి... ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు.

స్వస్థలానికి చేరుకున్న జవాన్‌ వెంకన్న మృతదేహం
స్వస్థలానికి చేరుకున్న జవాన్‌ వెంకన్న మృతదేహం

By

Published : Mar 6, 2021, 6:03 PM IST

Updated : Mar 6, 2021, 6:20 PM IST

పంజాబ్​లోని పటాన్‌కోట్‌లో మరణించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్లకు చెందిన ఆర్మీ జవాను వెంకన్న మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జవాను మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

ఆర్మీ అధికారులు సైనిక వందనం నిర్వహించారు. అయితే జవాన్‌ వెంకన్న మృతి గురించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని బంధువులు తెలిపారు.

స్వగ్రామానికి చేరుకున్న జవాన్‌ వెంకన్న మృతదేహం

ఇదీ చదవండి: పాఠశాలల ఫీజుల మోత... సామాన్యులకు కష్టాల వాత

Last Updated : Mar 6, 2021, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details