తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎం కేసీఆర్​ టోపీ పెట్టుకొని వచ్చి.. ప్రజల నెత్తిన టోపీ పెట్టారు' - munugode bypoll campaign on Bandi Sanjay

Bandi Sanjay on KCR Meeting: సీఎం కేసీఆర్​ టోపీ పెట్టుకొని వచ్చి.. ప్రజల నెత్తిన టోపీ పెట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పేర్కొన్నారు. ఇన్ని రోజులుగా ఎమ్మెల్యేలను ప్రగతిభవన్​లో గంపకింద దాచిపెట్టి.. ఇప్పుడు తనతో పాటు హెలికాప్టర్​లో రహస్యంగా తీసుకొచ్చారని అన్నారు. ఏ తప్పు చేయనప్పుడు.. ఆ ఎమ్మెల్యేలను అంత జాగ్రత్తగా ప్రగతిభవన్​లో దాయాల్సిన పని ఏం ఉందని ఆయన మండిపడ్డారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : Oct 30, 2022, 10:46 PM IST

Bandi Sanjay on KCR Meeting: మునుగోడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేసీఆర్​ మునుగోడు నియోజకవర్గ సమస్యలపై మాట్లాడలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడలో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్​ ఏ కుల వృత్తుల వారికి నిర్ధిష్టమైన హామీ ఇవ్వలేదని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏ తప్పు చేయని కేసీఆర్..​ ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు అంత రహస్యంగా దాస్తున్నారని దుయ్యబట్టారు.

ఇన్నిరోజులు ప్రగతిభవన్​లో గంపకింద పెట్టి దాచి.. ఇప్పుడు తనతో పాటు హెలీకాప్టర్​లో తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ఆ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం భాజపాకు లేదని పేర్కొన్న ఆయన.. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత 38 ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొనుగోలు చేసినట్లు కేసీఆర్​ కొనుగోలు చేశారని ఆయన ధ్వజమెత్తారు. మోటార్లకు మీటర్లు పెట్టామని భాజపాని విమర్శించిన కేసీఆర్..​ మేము ఎక్కడ మీటర్లు పెట్టామో చెప్పాలని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలు జరిగిన తరువాత ప్రభుత్వం ఏదో ఒక రోజు కరెంట్​ ఛార్జీలు పెంచడం ఖాయమని ఆయన అన్నారు.

'తప్పు చేయనప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు అంత రహస్యంగా దాస్తున్నారు'

"ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏ తప్పు చేయని కేసీఆర్​ ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు అంత రహస్యంగా దాస్తున్నారు. ఇన్ని రోజులు ఆ ఎమ్మెల్యేలను ప్రగతిభవన్​లో గంపకింద పెట్టి దాచి ఇప్పుడు తనతో పాటు హెలీకాప్టర్​లో తీసుకొచ్చారు. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత 38 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొనుగోలు చేసినట్లు కేసీఆర్​ కొనుగోలు చేశారు".- బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details