తెలంగాణ

telangana

ETV Bharat / state

కూలీల ఆటో బోల్తా.. పలువురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం! - నల్గొండలో కూలీల ఆటో బోల్తా

బత్తాయిలు తెంపడానికి కూలీకి వెళ్తున్న ఆటో బోల్తాపడి అందులోని కూలీలు గాయపడిన సంఘటన నల్గొండ జిల్లా పరిధిలో చోటు  చేసుకుంది. గాయాలతో బాధపడుతున్న వారిని నాగార్జున సాగర్​ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Auto Accident In nalgonda Tirumalagiri
కూలీల ఆటో బోల్తా.. పలువురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం!

By

Published : Aug 25, 2020, 10:53 AM IST

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం జానారెడ్డి కాలనీ వద్ద బత్తాయిలు తెంపడానికి వెళ్తున్న కూలీల ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన సమయంలో ఆటోలో 15 మంది కూలీలున్నారు. అందులో కొందరికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని నాగార్జున సాగర్​ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషమ పరిస్థితిలో ఉన్న క్షతగాత్రుడిని నల్గొండ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కూలీలు తిరుమలగిరి మండలం జాల్​ తండాకు చెందిన వారని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details