ఇంక మమ్మల్ని వదలరా: అమృత - ఇంక మమ్మల్ని వదలరా: అమృత
ప్రణయ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడు కాదని... అమర ప్రసాద్ అనే వ్యక్తి తమ కుటుంబాన్నీ పలుమార్లు ఇదే విషయంపై ఫిర్యాదు చేస్తూ వేధిస్తున్నారని ప్రణయ్ భార్య అమృతవర్షిణి ఆరోపించారు.
పరువుహత్యలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌ను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ప్రణయ్ ఎస్సీ వర్గానికి చెందినవాడు కాదని కొందరు తమ కుటుంబసభ్యులను వేధిస్తున్నారని ప్రణయ్ భార్య అమృత ఆరోపించారు. మిర్యాలగూడలోని తమ నివాసంలో కుల పెద్దలతో కలిసి సమావేశమయ్యారు. ప్రణయ్‌ను హిందూ సంప్రదాయ ప్రకారం ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నానని... ప్రణయ్ హత్యకి ముందు రోజు కూడా ఇద్దరం కలిసి వినాయక చవితి పండుగ ఇంట్లో చేశామని అమృత తెలిపారు. వివాహ రిసెప్షన్ వేడుక కార్డును సైతం ఆంజనేయ స్వామి ఆలయంలో ఉంచామని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం విషయంలో రాద్ధాంతం చేస్తూ అమర ప్రసాద్ తనను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.