నల్గొండ జిల్లా దేవరకొండలో ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎంఈవో కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దేవరకొండ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ... కన్నీటి పర్యంతమయ్యారు.
హెచ్ఎం వేధిస్తున్నాడని ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం - ప్రధానోపాధ్యాయుడు తాజా వార్త
ఆడవారికి వేధింపులు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ప్రధానోపాధ్యాయుడి స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఓ ఉపాధ్యాయురాలు ఆత్యహత్యాయత్నం చేసింది.
'నన్ను ప్రధానోపాధాయుడు వేధిస్తున్నాడు'