నల్గొండ పురపాలిక వైస్ ఛైర్మన్‌గా... అబ్బగోని రమేశ్ నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక మాదిరిగానే వైస్‌ఛైర్మన్ ఎన్నిక కూడా సాఫీగా సాగింది. పుర ఎన్నికల్లో తెరాస-20, కాంగ్రెస్-20, భాజపా-6, ఎంఐఎం-1, స్వతంత్ర అభ్యర్థి-1 గెలుపొందారు. ఇందులో ఏ పార్టీకీ మెజార్టీ రాలేదు.
ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల 5 ఓట్లతో మొత్తం తెరాసకు 27 మంది మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీతో నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం తెరాస కైవసం చేసుకుంది.
వైస్ ఛైర్మన్ ఎన్నికలోనూ... తెరాసకు 27 మంది మెజార్టీ ఉంది. 47వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన అబ్బగోని రమేశ్‌ను ఏకగ్రీవంగా నల్గొండ పురపాలిక వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. సీఎం కేసీఆర్ మీద నమ్మకంతోనే పుర ఎన్నికల్లో ప్రజలు తెరాసకు పట్టం కట్టారని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి నల్గొండకు వస్తారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని తెలిపారు.