ఆ తల్లిదండ్రులు ఎక్కని మెట్టు లేదు... తొక్కని గడప లేదు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. అతుకుల బొతుకుల జీవితంలో.. కొడుకునెలా కాపాడుకోవాలో తెలియని ధైన్యం వాళ్లది. ఈ కన్నీటి గాథ... నల్గొండకు చెందిన వెంకటేశ్, పావని దంపతులది.
నల్గొండకు చెందిన ఆకుల వెంకటేశ్, పావని దంపతులకు తొమ్మిది నెలల కుమారుడు విఘ్నేశ్ ఉన్నాడు. వెంకటేశ్ దినసరి కూలీ. పని దొరికితే వచ్చే ఆ కూలీ డబ్బులపైనే ఆ కుటుంబం ఆధారపడి ఉంది. ఉన్న దాంట్లో సద్దుకుపోయే వారికి... కొడుకు అనారోగ్యం కష్టాల్లోకి నెట్టింది. విఘ్నేశ్ శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండడం వల్ల ఆస్పత్రులు చుట్టు తిరిగారు. అయినా నయం కాకపోవడం వల్ల అప్పు చేసి హైదరాబాద్‌లోని నిలోఫర్, రెయిన్ బో ఆస్పత్రుల్లో చూపించగా హృదయ సంబంధిత సమస్యగా గుర్తించారు.
ఆపరేషన్‌కు రూ.5 లక్షలు