తెలంగాణ

telangana

ETV Bharat / state

భానుడికి పోటీగా ఓటర్ల బారులు - election

భానుడి భగభగలకు ముందే ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఓటర్లు బారులు

By

Published : May 10, 2019, 11:01 AM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రెండో విడత ప్రదేశిక ఎన్నికలు ఐదు మండలాల్లో జరుగుతున్నాయి. ఎండ దృష్ట్యా ఓటు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ఓటర్లకు అధికారులు మంచినీటి సదుపాయం కల్పించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఓటర్లు బారులు

ABOUT THE AUTHOR

...view details