తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్​కు భారీ వరద.. 16 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్​కు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఇన్​ఫ్లోగా 2 లక్షల 79 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఫలితంగా సాగర్ జలాశయం 16 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి స్పిల్ వే నుంచి 2 లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.

సాగర్​కు భారీ వరద.. 16 గేట్లు ఎత్తివేత
సాగర్​కు భారీ వరద.. 16 గేట్లు ఎత్తివేత

By

Published : Sep 20, 2020, 11:04 AM IST

Updated : Sep 20, 2020, 4:56 PM IST

నాగార్జున సాగర్ జలాశయానికి వరద భారీగా వస్తుండటంతో 16 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ దిగువన ఉన్న ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 29 వేల క్యూసెక్కుల నీరు పులిచింతల వైపు విడుదల చేశారు. సాగర్ కుడి, ఎడమ కాల్వలకు కలిపి సాగు నీరు 10 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.

590కి గానూ 589 అడుగుల నీటిమట్టం..

సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 కాగా ప్రస్తుతం 589 అడగులకు నీటిమట్టం చేరింది. 312.04 టీఎంసీల నిల్వ సామర్ధ్యం ఉండగా ప్రస్తుతం 309.05 టీఎంసీల వద్ద నీటి నిల్వ ఉంది. పైనుంచి వరద ప్రవాహాన్ని బట్టి నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి నేటి వరకు సాగర్ జలాశయం నుంచి వరద దిగువకు కొనసాగుతోందన్నారు.

సాగర్​కు భారీ వరద.. 16 గేట్లు ఎత్తివేత

ఇవీ చూడండి : భగ్గుమంటున్న ధరలు.. సామాన్యునికి కూర'గాయాలు'

Last Updated : Sep 20, 2020, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details