తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగార్జునసాగర్​కు భారీగా చేరుతున్న వరదనీరు

నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 14 గేట్లు ఎత్తి.. 10 అడుగుల మేర నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి అధికారులు గేట్లను ఎత్తడం, దించడం చేస్తున్నారు.

14-gates-lifted-due-to-heavy-inflow-in-nagarjuna-sagar-project-at-nalgonda
నాగార్జునసాగర్​కు భారీగా చేరుతున్న వరదనీరు

By

Published : Sep 15, 2020, 10:29 AM IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 14 గేట్లు ఎత్తి... 10 అడుగుల మేర నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్​కు ఇన్​ఫ్లో 2,48,266 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా... అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 310 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 589.60 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వచ్చే వరదలో హెచ్చుతగ్గులను బట్టి అధికారులు సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తడం, దించడం చేస్తున్నారు.

నాగార్జునసాగర్​కు భారీగా చేరుతున్న వరదనీరు

ఇదీ చూడండి:రాయలసీమ ఎత్తిపోతాలు ఆపాలని కోరిన తెలంగాణ సర్కారు

ABOUT THE AUTHOR

...view details