నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని మంగనూరుకు చెందిన శ్రీనివాసులును అతడి భార్యే హతమార్చింది. మద్యానికి బానిసై ఆమెతో నిత్యం గొడవపడటం వల్ల..వేధింపులు తట్టుకోలేక కత్తితో గొంతు కోసి చంపేసింది.
వేధింపులు తట్టుకోలేక భర్తను చంపిన భార్య...!
నాగర్‌కర్నూల్ జిల్లా మంగనూరులో దారుణం చోటుచేసుకుంది. జీవితాంతం తోడుగా నిలవాల్సిన భార్యే.. భర్తను ఖతం చేసింది. అత్యంత కిరాతకంగా హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వేధింపులు తట్టుకోలేక భర్తను చంపిన భార్య...!
రాత్రి ఎవరూ లేని సమయంలో ఆరుబయట నిద్రిస్తున్న శ్రీనివాస్‌ను చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవీ చూడండి:దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్....!