తెలంగాణ

telangana

ETV Bharat / state

'నల్లమలలో ఆదివాసులను అణిచివేసే కుట్ర'

ఇక్కడ స్వేచ్ఛగా జీవించే ఆదివాసులను అంతం చేసే కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ నేత వీహెచ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు.

By

Published : Aug 12, 2019, 10:29 AM IST

'నల్లమలలో ఆదివాసులను అణిచివేసే కుట్ర'

నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం నల్లమలలోని మల్లాపూర్ చెంచు పెంటను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ హనుమంతరావు సందర్శిచారు. యురేనియం వలన కలిగే నష్టం గురించి చెంచులకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం ఒప్పంద సంస్థ డీబీర్​తో రహస్య ఒప్పందం చేసుకుందన్నారు. పక్కనే కృష్ణానది ప్రవహిస్తూ ఎన్నో లక్షల కుటుంబాలకు జీవం పోస్తున్న నదిని యురేనియం పేరుతో కలుషిత చేయబోతున్నారని ఆరోపించారు.ఎన్ని అడ్డంకులు ఎదురైనా తవ్వకాలకు అనుమతించేది లేదని తేల్చిచెప్పాపు. యురేనియం తీయడం ద్వారా ఇక్కడ నివసించే ప్రజల మనుగడకు ప్రమాదం పొంచి ఉందన్నారు. యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డా.వంశీకృష్ణ, యురేనియం వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు నాసరయ్య, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

'నల్లమలలో ఆదివాసులను అణిచివేసే కుట్ర'

ABOUT THE AUTHOR

...view details