జోగులాంబ గద్వాల జిల్లా చెనుగోనుపల్లిలో నాగర్‌కర్నూల్ తెరాస పార్లమెంట్ అభ్యర్థి పి.రాములు తరఫున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంది ఎల్లయ్యతో నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు. రాములును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ఎంపీగా రాములును గెలిపిస్తే ఇంకా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
'రాములును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించండి' - ramulu
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రచారం జోరందుకుంటోంది. నాగర్‌కర్నూల్ తెరాస ఎంపీ అభ్యర్థి రాములు తరపున ఎమ్మెల్యే బండ్ల... ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే బండ్ల