తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి మహబూబ్​నగర్​​​లో 2960 నామినేషన్లు దాఖలు - పురపాలక ఎన్నికలు

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 17 మున్సిపాలిటీలు కలిపి మొత్తం 2960 నామినేషన్లు దాఖలయ్యాయి.

total nominations in mahabobnagar
ఉమ్మడి మహబూబ్​నగర్​​​లో 2960 నామినేషన్లు దాఖలు

By

Published : Jan 11, 2020, 2:44 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలుండగా 338 వార్డులకు 2960 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.


మహబూబ్​నగర్ జిల్లాలో మొత్తం రెండు మున్సిపాలిటీలుండగా 692 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబ్​నగర్​లో 602, భూత్పూర్​లో 90 మంది అభ్యర్థులు పత్రాలు సమర్పించారు.


నారాయణపేట జిల్లాలో మూడు మున్సిపాలిటీలకు 576 మంది బరిలో నిలిచారు. నారాయణపేటలో 151, మక్తల్​లో 255, కోస్గిలో 170 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీలకు 813 మంది అభ్యర్థులు పత్రాలు సమర్పించారు. వనపర్తిలో 408, కొత్తకోటలో 143, పెబ్బేరులో 93, ఆత్మకూరులో 74, అమరచింతలో 95 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

నాగర్​కర్నూల్​ జిల్లాలో 3 మున్సిపాలిటీలకు 615 నామినేషన్లు దాఖలయ్యాయి. నాగర్​కర్నూల్​లో 223, కల్వకుర్తిలో 174, కొల్లాపూర్​లో 218 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.


జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మున్సిపాలిటీలకు 492 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గద్వాలలో 217, అలంపూర్​లో 81, వడ్డేపల్లిలో 55 మంది పత్రాలు దాఖలు చేశారు.

ఉమ్మడి మహబూబ్​నగర్​​​లో 2960 నామినేషన్లు దాఖలు

ఇవీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన

ABOUT THE AUTHOR

...view details