మహారాష్ట్రలోని అంబేడ్కర్ నివాసమైన రాజగృహపై దాడికి పాల్పడ్డ వ్యక్తులపై రాజద్రోహం కేసు నమోదు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ దాడిని అందరూ ఖండించాలన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో యూటీఎఫ్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
రాజగృహపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: మందకృష్ణ
అంబేడ్కర్ రాజగృహపై దాడి కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రాజగృహ ప్రాంతాల్లో నిఘా పెట్టాలని కోరారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
manda krishna
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలన్నారు. అంబేడ్కర్ వల్ల లబ్ధి పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన రాజకీయనాయకులు, ఉద్యోగులు... రాజగృహపై దాడి జరిగితే ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టక పోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బాలయ్య, బీసీ సంఘం నేతలు బాలాజీ సింగ్, రాజేందర్, సదానందం గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.