నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నిన్న కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయమై ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అస్వస్థత గురైన విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులను ఆరోగ్య ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. కొంత మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడడం చూసిన ఎమ్మెల్యే.. స్పెషల్ ఆఫీసర్ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన భోజనం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.
విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యే - kgbn
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన 40 మంది విద్యార్థులను పరామర్శించారు.
సిబ్బందిని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే