ప్రశాంతమైన చల్లగాలి... చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం. ప్రస్తుతం నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఇదే నా చివరి వీడియో. నా కోసం ఎవరూ వెతకొద్దు. నేను ఇక్కడే చనిపోతాను... అంటూ ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టాడు.
కుటుంబ సమస్యలు తట్టకోలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మద్యం సేవిస్తూ మరీ గిరిజన లంబాడీ భాషలో చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మిథ్య తండాకు చెందిన హేమంత్ నాయక్... హైదరాబాద్లో డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం సాసగించేవాడు.
ఇటీవలే స్వగ్రామానికి తిరిగివచ్చిన ఇతను... కుటుంబ కలహాల కారణంగా ఈ నెల 15న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
బంధువులు, స్నేహితుల దగ్గర ఉన్నాడేమోనని కనుక్కున్న కుటుంబ సభ్యులు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా... అదృశ్యమైన వ్యక్తి చివరగా మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. నల్లమల అటవీ ప్రాంతంలో గాలిస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
సెల్ఫీ వైరల్: 'నేను చచ్చిపోతున్నా.. నా కోసం ఎవరూ వెతకొద్దు' ఇవీ చూడండి:'దేశంలోనే తెలంగాణ అతి తక్కువ పరీక్షలు చేస్తుంది'