ఏసుక్రీస్తు చూపిన జాలి, దయ, ప్రేమ అనురాగం అనే మార్గాల్లో నేటి సమాజం నడవాలని కలెక్టర్ శర్మన్ చౌహన్, ఎమ్మెల్సీ రాజేశ్వర రావు కోరారు. నాగర్ కర్నూల్ జిల్లాకేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం క్రైస్తవ గీతాలను ఆలపించి ప్రార్థన చేశారు.
నాగర్ కర్నూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు - nagarkurnool collector shaman chauhan latest news
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ శర్మన్ చౌహాన్, ఎమ్మెల్సీ రాజేశ్వర రావు, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏసుక్రీస్తు చూపిన జాలి, దయ, ప్రేమ అనురాగం అనే మార్గాల్లో నేటి సమాజం నడవాలని వారు కోరారు.
ఎదుటి వారికి సాయం చేయడంలోనే దైవత్వం ఉందని కలెక్టర్ అన్నారు. గత ప్రభుత్వాలు క్రైస్తవులను పట్టించుకోలేదని... ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి సీఎం కేసీఆర్ అన్ని మతాల వారిని అక్కున చేర్చుకుంటున్నారని రాజేశ్వర రావు పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జిల్లాలో 4,000 బహుమతులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రజల సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించం: హైకోర్టు