రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు - nagarkurnool
మసీదులు, ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో ముస్లిం సోదరులు రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నా, పెద్ద అందరూ కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రార్థన అనంతరం కబ్రిస్తాన్లకు వెళ్లి పెద్దల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. బందోబస్తు చేస్తున్న పోలీసులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.