తెలంగాణ

telangana

ETV Bharat / state

వరుణుడి బీభత్సం.. అన్నదాతకు పుట్టెడు కష్టం

ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నీటి పాలవుతుంటే చూస్తుండటం తప్ప ఏమి చేయలేనిస్థితి అన్నదాతలది. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను కోటి ఆశలతో అమ్మకానికి తీసుకొస్తే వరుణుడు తన ప్రతాపంతో తమ నోట్లో మట్టికొట్టాడని వాపోతున్నారు. దీనస్థితిలో ఉన్న తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

varsha-beebathsam

By

Published : Apr 30, 2019, 11:47 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలో వర్షం బీభత్సం సృష్టించింది. మార్కెట్​ యార్డులోని ధాన్యం తడిచిపోయింది. ఏరులా పారిన వర్షం నీటిలో కర్షకుల కష్టం కొట్టుకుపోయింది. అనుకోకుండా ముంచెత్తిన అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

ఇక్కడకు తేకపోయినా బాగుండేదేమో..

వర్షమొస్తున్నప్పుడు బస్తాలపై కప్పేందుకు, రాశులుగా ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్​ సంచులను అధికారులు సమకూర్చక పోవడం వల్ల అంతా తుడిచిపెట్టుకుపోయిందని రైతులు వాపోయారు. తమ పంట ఇక్కడికి తేకున్నా కాపాడుకునేవాళ్లమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నదాతలంటే ఇంత అలుసా..

మార్కెట్​ యార్డులో కనీస సౌకర్యాలు లేవని.. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే ముఖ్యమంత్రిని అడగండని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారంటూ అన్నదాతలు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని దీనంగా వేడుకొంటున్నారు.

ప్రతి గింజనూ కొంటాం

నాగర్​ కర్నూల్​జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కేంద్రాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి సందర్శించారు. తడిచిన ప్రతి గింజను కొలుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. సుమారు 20 నుంచి 25 వేల బస్తాల ధాన్యం తడిచి ఉండవచ్చని అంచణా వేస్తున్నారు.

గాలివాన ఉద్ధృతికి భారీ వృక్షాలు నేల కులాయి. రోడ్డు పక్కల చిరు వ్యాపారుల బళ్లు పడిపోయాయి. విద్యుత్​ స్తంభాలు విరిగిపడ్డాయి. నగరంలో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

వరుణుడి బీభత్సం
ఇదీ చదవండి: గొంతు నులిమి చంపి... డ్రమ్ములో వేశాడు

ABOUT THE AUTHOR

...view details