తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్థికంగా చితికిపోయాం.. ఆదుకోండి'

కరోనా వేళ ప్రైవేట్ అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణయ్య తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అక్షర పాఠశాలలో ప్రైవేటు కళాశాలల అధ్యాపకులు కలిసి ఒక్కరోజు ఆకలి దీక్ష కార్యక్రమం చేపట్టారు.

private teachers and lecturers protest in nagarkurnool
మేం ఆర్థికంగా చితికోయాం.. ఆదుకోండి: ప్రైవేటు అధ్యాపకులు

By

Published : Jun 7, 2020, 7:19 PM IST

Updated : Jun 7, 2020, 8:21 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆకలి దీక్షలో భాగంగా ప్రైవేట్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు నాగర్​కర్నూల్​ పట్టణంలోని గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం ఒక్కరోజు ఆకలి దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు రామకృష్ణయ్య పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వర్గాల ప్రజలకు ఆర్థికసాయం అందించింది కానీ.... ప్రైవేట్ అధ్యాపకులు, ఉపాధ్యాయులకు మాత్రం ఎటువంటి సాయం అందించలేదని అన్నారు. మూడు నెలలుగా యాజమాన్యాలు ఎలాంటి జీతాలు చెల్లించకపోవడం వల్ల ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులను రాష్ట్రం ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి:రూ. 15 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఆర్​ఐ

Last Updated : Jun 7, 2020, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details