తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షం.. నీటమునిగిన ధాన్యం - Nagar Kurnool district latest news

శుక్రవారం కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. పలుచోట్ల పంటలు నీటమునగగా... కల్లాల్లోని వరిపంట వర్షార్పణమైంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి... తీరా చేతికొచ్చిన పంట నీటపాలవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

Premature rain
నాగర్​ కర్నూల్​ జిల్లాలో అకాల వర్షం

By

Published : May 15, 2021, 7:17 AM IST

నాగర్‌కర్నూల్ జిల్లా కోడెరులో అకాల వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. 10రోజుల కిందట మార్కెట్‌కు తీసుకువచ్చిన వరిధాన్యం తూకం వేయకపోవటంతో అక్కడే నిలిచిపోయింది. ఎండనకా, వాననకా నిత్యం ధాన్యం కాపలా ఉన్నామని వాపోయారు. తీరా లారీలు రావడం లేదని అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో అకాల వర్షానికి ధాన్యం తడసిపోవడంతో... తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నాగర్​ కర్నూల్​ జిల్లాలో అకాల వర్షం

శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం బస్తాల చుట్టూ వాననీరు చేరటంతో... రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేసి... ఇక్కడి నుంచి తరిలించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details