ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండడంతో పంటలన్నీ దెబ్బతిన్నాయని... అన్నదాతలు వాపోతున్నారు. లక్షల్లో అప్పులు చేసి పంటలు వేశామని... ఇప్పుడు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి... పత్తి, వరి, మిర్చి పంటన్ని పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాలు... రైతుల పాలిట యమపాశాలు - నాగర్‌కర్నూలు జిల్లా వార్తలు
అకాల వర్షంతో పత్తి, మిరప, వరి పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయని... ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు లబోదిబోమంటున్నారు. లక్షలు పెట్టి సాగు చేసిన పంట అంతా నీట మునగడంతో ఏమి చేయలేని నిస్సాహాయ స్థితిలో ఉన్నామని... తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల పరిధిలో భారీ వర్షం పడడంతో పంటలు దెబ్బతిన్నాయి. గోరిట, గుమ్మకొండ, ఆవంచ, ఇప్పలపల్లి గ్రామాలలో వ్యవసాయ అధికారులు పర్యటించారు. మండలంలో పత్తి, మిర్చి, వరి పంటలు భారీ స్థాయిలో పాడైపోయాయని తెలిపారు. అకాల వర్షాలకు చెరువులు, కుంటలన్నీ మత్తడి పోయడం వల్ల నష్టం జరిగిందని వెల్లడించారు. నష్టాలపై ఇంకా ప్రాథమిక సమచారం రాలేదని... గ్రామాలలో వ్యవసాయ అధికారులు పర్యటిస్తున్నారని.. వారిచ్చిన సమచారం ప్రకారం... జిల్లా స్థాయి అధికారులకు నష్టాలపై నివేదికలు పంపిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:భారీ వర్షాలు... జలమయమైన లోతట్టు ప్రాంతాలు