నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కృష్ణా తీర గ్రామమైన సోమశిలలో క్రీ.పూ.4000-2000 మధ్య కాలానికి చెంది కొత్త రాతి యుగపు గొడ్డలి బయటపడిందని సోమశిలలోని పురావస్తు శాఖ పూర్వ స్థపతి, ప్రస్తుత కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈవో డా.ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
సోమశిలలో బయల్పడిన కొత్త రాతి యుగపు గొడ్డలి - krishna river news
నాగర్‌కర్నూల్ జిల్లాలోని కృష్ట్రా నది తీరాన రాతి యుగానికి చెందిన ఒక అపురూపమైన ఆనవాలు లభించింది. ఓ రైతు చేనులో జరిపిన తవ్వకాల్లో అది బయటపడిందని పురావస్తు శాఖ అధికారులు పేర్కొన్నారు. ఏమిటది.. ఎందుకంత ప్రత్యేకత తెలుసుకుందాం పదండి.
సోమశిలలో బయల్పడిన కొత్త రాతి యుగపు గొడ్డలిసోమశిలలో బయల్పడిన కొత్త రాతి యుగపు గొడ్డలి
ఆదివారం సోమశిలలోని సోమనాథస్వామి ఆలయానికి తూర్పు దిక్కున ఉన్న తెలుగు పెంటయ్య చేనులో జరిపిన తవ్వకాల్లో ఈ రాతి గొడ్డలి బయటపడిందని పురావస్తు శాఖ పేర్కొన్నారు. 4 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు, అంగుళం మందంతో ఉన్న ఈ గొడ్డలిని నల్లశానపు రాతితో అంచు మొనదేలేలా అరగదీసి నునుపుగా తీర్చిదిద్దారని వివరించారు.