నాగర్ కర్నూల్ జిల్లాలోని వసతి గృహల్లో నాణ్యమైన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ శర్మన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని స్థానిక జ్యోతిరావు పూలే బీసీ కళాశాల వసతి గృహన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యత లోపించిన ఆహారం తిని అస్వస్థతకు గురైన 15మంది విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని... నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు. పట్టణంలోని స్థానిక జ్యోతిరావు పూలే బీసీ కళాశాల వసతి గృహన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యత లోపించిన ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఇకపై వారికి ఏ కష్టం రానివ్వమని భరోసా ఇచ్చారు. ఏదైనా సమస్య వస్తే తనకు స్వయంగా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపల్, వార్డెన్, వంట మనిషిని కలెక్టర్ వివరణ కోరారు. గత మార్చి నుంచి నిల్వ ఉంచి, పురుగులు పట్టిన బియ్యాన్ని వండటం వల్లే ఫుడ్ పాయిజన్ అయినట్టు కలెక్టర్ గుర్తించారు.
ఇదీ చదవండి: నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన