నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని నల్లమల అడవిలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో... అక్కమ్మ దేవీ ఆలయానికి వెళ్లే దారిలో అత్యాచారం, హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనాస్థలంలో నిమ్మకాయలు, కుంకుమ, అగర్బత్తీలు ఉన్నాయి. వీటిని బట్టి క్షుద్రపూజల కోసం చేసినట్లు తెలుస్తోంది. మృతదేహం వద్ద ఫొటో, ఆధార్ కార్డు, పాటు బ్యాగు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు ముంబయికి చెందిన శాంత రవి ముదలియార్‌గా గుర్తించారు.