నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల పరిషత్ అధ్యక్ష పదవికోసం తెరాసకు చెందిన రెండు వర్గాల వారు బాహాబాహీకి దిగారు. మాజీమంత్రి జూపల్లి వర్గానికి ఎంపీపీ స్థానం, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయులకు జడ్పీటీసీ ఇచ్చేటట్టుగా ముందుగా ఒప్పందం చేసుకున్నారు. కానీ ఎంపీటీసీలు ఎమ్మెల్యే వర్గానికి చెందిన సభ్యురాలిని ఎంపీపీగా ఎన్నుకునేందుకు నిర్ణయించారు. దీంతో జూపల్లి వర్గానికి పదవి దక్కే అవకాశాలు లేకుండా పోయాయి. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా... మండల కేంద్రానికి వచ్చిన ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
పెంట్లవెల్లిలో తెరాస వర్గాల కొట్లాట - nagarkarnool
నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి తెరాసలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీమంత్రి, ఎమ్మెల్యే వర్గీయులు ఎంపీపీ పీఠం కోసం ఘర్షణ పడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి అదుపు చేశారు.
పెంట్లపల్లిలో తెరాస వర్గాల కొట్లాట