తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామగ్రామాన భాజపా జెండా ఎగురవేద్దాం' - bjp

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో మంగళవారం భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామచందర్ రావు హాజరయ్యారు.  పార్టీలో అత్యధిక సభ్యత్వాలు చేర్చుకుని ప్రపంచంలో భాజపాకు గుర్తింపు తేవాలని ఎమ్మెల్సీ అన్నారు.

'గ్రామగ్రామాన భాజపా జెండా ఎగురవేద్దాం'

By

Published : Jul 10, 2019, 8:40 PM IST

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో భాజపా సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ రామచందర్ రావు హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ పేద ప్రజల బాగోగుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని రామచందర్‌ రావు అన్నారు. కానీ రాష్ట్రంలో సరిగా అమలు కాకపోవడం వల్ల నిర్వీర్యం అవుతున్నాయన్నారు. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి గ్రామగ్రామాన జండా ఎగురవేయడానికి కార్యకర్తలు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కొల్లాపూర్‌లో చాలా సమస్యలు పేరుకు పోయాయన్నారు. జాతీయ రహదారి, రైల్వే మార్గం, సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం అయితేనే కొల్లాపూర్​ అభివృద్ధి చెందుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి భాజపా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.

'గ్రామగ్రామాన భాజపా జెండా ఎగురవేద్దాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details