తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్ వార్డును ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ వార్డును ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనాతో బాధపడుతున్న రోగులను.. వారి వద్దకు వెళ్లి పరామర్శించారు. పేద ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.

mla Marri Janardhan Reddy, nagar kurnool hospital
mla Marri Janardhan Reddy, nagar kurnool hospital

By

Published : May 7, 2021, 9:41 PM IST

కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ వార్డును ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.

డాక్టర్ సరిగా వస్తున్నారా.. లేదా.. అని ఆరా తీశారు. వారికి మనోధైర్యాన్ని కల్పించారు. సమయానికి పోషకాహారాన్ని అందించాలని.. ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు.

అంతకుముందు పేద ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. కరోనా కాలంలోనూ కేసీఆర్ ప్రభుత్వం.. సంక్షేమ పథకాలకు ఎలాంటి లోటు రాకుండా చూస్తోందన్నారు. అందరూ కరోనా నియమాలను పాటిస్తూ.. ప్రార్థనలు, పండుగను జరుపుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: జ్వరం లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి: మేయర్​

ABOUT THE AUTHOR

...view details