తెలంగాణ

telangana

ETV Bharat / state

'సొంత గ్రామానికి నిధులిచ్చినట్లే అన్ని గ్రామాలకు ఇవ్వాలి' - tpcc

ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత గ్రామాభివృద్ధికి నిధులిచ్చినట్లే అన్ని గ్రామాలకు ఇవ్వాలని టీపీసీపీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. సొంత గ్రామానికే నిధులిస్తే మిగతా గ్రామాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

'సొంత గ్రామానికి నిధులిచ్చినట్లే అన్ని గ్రామాలకు ఇవ్వాలి'

By

Published : Jul 23, 2019, 8:15 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతూరిలో ఇంటికి పది లక్షల రూపాయల చొప్పున లబ్ధి చేకూరేలా పథకాలు రూపొందించిన విషయంపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పందించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిధులివ్వాలని డిమాండ్​ చేశారు. ఒక్క గ్రామానికే రూ.200 కోట్లు కేటాయించారని... పుట్టి పెరిగిన గ్రామంపై మమకారం ఉండడంలో తప్పులేదని... రాష్ట్రంలోని అన్ని గ్రామాలనూ అలాగే పట్టించుకోవాలని కోరారు. కేవలం ఒక్క గ్రామానికే నిధులిచ్చి చేతులు దులుపుకుంటే వేలాది గ్రామాలు నష్టపోతాయన్నారు.

'సొంత గ్రామానికి నిధులిచ్చినట్లే అన్ని గ్రామాలకు ఇవ్వాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details