నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలోని దుందుబీ వాగులో ప్రమాదవశాత్తు పడి కొట్టుకుపోతున్న యువకుడిని స్థానికులు కాపాడారు. తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు హైదరాబాద్ నుంచి రఘుపతిపేట గ్రామానికి వెళ్తుండగా వాగు దాటే ప్రయత్నంలో ప్రమాదం జరిగింది. చేపలు పడుతున్న స్థానికులు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోతున్న యువకుడిని గమనించి తాడు సాయంతో కాపాడేందుకు యత్నించారు.
వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి... స్థానికుల సాహసం
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలోని దుందుబీ వాగులో ప్రమాదవశాత్తు పడి కొట్టుకుపోతున్న యువకుడిని స్థానికులు కాపాడారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్న ఆంజనేయులు వాగు దాటుతుండగా ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. యువకుడు ప్రాణాలతో బయటపడడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు.
వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి... స్థానికుల సాహసం
కల్వకుర్తి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గ్రామస్థుల సాయంతో నీటిలో ఉన్న యువకుడిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. బాధితుడి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. సకాలంలో స్పందించి తమ కుమారుని ప్రాణాలను కాపాడినందుకు రఘుపతిపేట గ్రామస్థులకు, పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:హేమంత్ హత్య కేసులో మలుపు.. తెరపైకి అవంతి సోదరుడు!