నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల కేంద్రంలో మద్యం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి మద్యం దుకాణాలను తెరిచేలా చర్యలు తీసుకోవడం వల్ల దుకాణాల వద్ద మద్యం బాబులు బారులు తీరారు. మద్యం అమ్మేవారు దుకాణాల ముందు భౌతిక దూరం పాటించే విధంగా వృత్తాలను గీసి వరుస క్రమాన్ని ఏర్పాటు చేశారు. మద్యం ప్రియులు ఉదయం నుంచే వరుసలో నిలబడి మద్యం కొనుగోలు చేశారు. మద్యం కొనేవారు చేతులకు బ్లౌజులు, మాస్కులు వేసుకోవాలని కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు, సీఐ సైదులు, ఎస్సై మహేందర్ దుకాణదారులకు, ప్రజలకు సూచించారు. మద్యం దుకాణాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.
ఉదయం నుంచే క్యూలో...